
Elections | ఊట్కూర్ మండలంలో 81 శాతం పోలింగ్ నమోదు.
Elections | ఊట్కూర్ మండలంలో 81 శాతం పోలింగ్ నమోదు.
- గ్రామాలవారీగా పోలైన ఓట్ల వివరాలు..
Elections | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో తుదిదశ గ్రామపంచాయతీ ఎన్నికలు(Elections) ఈ రోజు ప్రశాంతంగా కొనసాగాయి. ఊట్కూర్ మండలంలో 20 గ్రామపంచాయతీలకు గ్రామపంచాయతీ ఎన్నికలు జరగగా 41,780 మంది(41,780 people) ఓటర్లకు గాను 33,672 మంది తమ ఓటు హక్కు(voting rights) వినియోగించుకోగా 81 శాతం పోలింగ్ నమోదైనట్లు తాసిల్దార్ చింత రవి ఎంపీడీవో కిషోర్ కుమార్ తెలిపారు.
అమీన్పూర్ లో 1,464 మంది ఓటు హక్కు వినియోగించుకోగా,అవుసలోని పల్లి 1,302, బిజ్వార్ లో 2,070, చిన్నపొర్ల లో2,073, ఎడవెల్లిలో 1,803, కొల్లూరులో 1,160, కొత్తపల్లిలో561, లక్ష్మీ పల్లిలో336, మొగ్ధంపూర్ లో672, మల్లేపల్లి 1388, నాగిరెడ్డిపల్లి 432, ఓబులాపూర్ లో 423, పగిడిమర్రిలో 1,655, పెద్ద జట్రంలో 2,180, పెద్దపోర్ల లో 1966, పులిమామిడి, లో 3,495, సమిస్తాపూర్, లో 381, తిప్రాస్ పల్లిలో 1,615, ఊట్కూర్, లో 7,554, వల్లంపల్లి753మంది ఓటర్లు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

