Elections | పోలింగ్‌కు సన్నద్ధం

Elections | పోలింగ్‌కు సన్నద్ధం

  • డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో రెండో విడత ఎన్నికల సామ‌గ్రి తనిఖీ
  • ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం
  • నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్

Elections | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎన్నికల విధులకు హాజరు కాకుండా ఎవరైనా సిబ్బంది అనధికారికంగా గైర్హాజరైనట్లయితే వెంటనే వారి పేర్లను సస్పెన్షన్‌(Suspension) కు సిఫారసు చేయాలని డీఈఓను కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా రెండోవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతీ అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా రెండో విడత ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను కలెక్టర్ శనివారం క్షేత్రస్థాయిలో(In the field) పరిశీలించారు. ఎన్నికల పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామాగ్రి పంపిణీ కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆయన సందర్శించి ఏర్పాట్ల తీరుతెన్నులను సమీక్షించారు.

నాగర్ కర్నూల్ నియోజకవర్గం పరిధిలోని తిమ్మాజీపేట మండల కేంద్రంలో గుడ్ షెఫర్డ్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో పోలింగ్ సిబ్బందికి అందించాల్సిన ఎన్నికల సామ‌గ్రి పంపిణీ ప్రక్రియ(Material distribution process)ను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైన సామగ్రిని విడిగా గుర్తించి సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల్లో బందోబస్తు నిర్వహించేందుకు నియమించిన పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను(Vehicles) కలెక్టర్ తనిఖీ చేశారు. సిబ్బంది సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని మైక్రో అబ్జర్వర్లకు సూచనలు చేశారు.

Elections

బ్యాలెట్ పత్రాలను అత్యంత జాగ్రత్తగా తనిఖీ చేసి ప్యాకింగ్ చేయాలని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న తర్వాత ఓటింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను మరోసారి నిర్ధారించుకోవాలని తెలిపారు. సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా(Power supply) ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ అధికారులు (పీఓ), సహాయ పోలింగ్ అధికారులు (ఓపీఓ)లతో కూడిన అన్ని బృందాలు హాజరయ్యాయా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లు వంటి కీలక పోలింగ్ సామాగ్రి తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసు బందోబస్తు ఉండాలని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల(Distribution centers) వద్ద తాగునీరు, లైటింగ్, పార్కింగ్ సదుపాయాలు, రాకపోక మార్గాల్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

అనంతరం తిమ్మాజీపేట మండల పరిధిలోని అవంచ గ్రామంలో రెండోవ విడత ఆదివారం జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా తిమ్మాజీపేట మండలంలోని అవంచ గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాన్ని(Polling station) సందర్శించి ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం ఏర్పాట్లను కలెక్టర్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. కేంద్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించాలని(to resolve) సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి డీఈఓ రమేష్ కుమార్ స్థానిక మండలాధికారులు తదితరులు ఉన్నారు.

Leave a Reply