ఇప్పటికే 167 స్థానాలలో విజయం
మొత్తం స్థానాలు 343
అధికారం చేపట్టాలంటే 172 సీట్లు అవసరం
మిత్రపక్షం బ్లాక్ క్యూబికాయిస్ పార్టీ సహాకారంతో ప్రభుత్వ ఏర్పాటు
22 స్థానాలలో బ్లాక్ క్యూబికాయిస్ పార్టీ గెలుపు
ఈ ఎన్నికలలో ఓటమిని అంగీకరించిన విపక్ష కన్జర్వేటివ్ పార్టీ
ప్రదానిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేయనున్న మార్క్ కార్నీ
గత ప్రధాని ట్రుడో పై తీవ్ర వ్యతిరేకత ఉన్నా మార్క్ మ్యాజిక్ తో విజయం
వాంకోవర్ - కెనడా సాధారణ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ వరుసగా నాలుగో సారి అధికారాన్ని చేపట్టనుంది.. అక్కడ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికలలో 167 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది.. మిత్ర పక్షం సాయంతో ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ వరుసగా రెండోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కెనడాకు 45వ ప్రధానమంతి కానున్నారు.
కాగా, 343 స్థానాలు ఉన్న కెనడా పార్లమెంట్లో అధికారంలోకి రావడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 172. అధికార లిబరల్, ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీల మధ్య ప్రధానంగా ఎన్నికల సమరం కొనసాగింది.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. లిబరల్ పార్టీ 167 స్థానాల్లో గెలుపొందింది. ఇక, కన్జర్వేటివ్ పార్టీ 145 స్థానాలకు పరిమితమయ్యారు. . ఫ్రాంకోయిస్ బ్లాంకెట్ నేతృత్వంలోని బ్లాక్ క్యూబికాయిస్ పార్టీ 22 స్థానాల్లో గెలిచి, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఖలిస్థానీ అనుకూలుడైన జగ్మీత్ సింగ్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఆయన నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ నాలుగు స్థానాలు గెలిచి.. మరో 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయారు.
ఇక లిబరల్ నేత, ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ, కన్జర్వేటివ్ నాయకుడు పియరీ పోయిలివ్రే, ఎన్డీపీ చీఫ్ జగ్మీత్ సింగ్, బ్లాక్ క్యూబెకోయిస్ అధినేత వైవ్స్-ఫ్రాంకోయిస్ బ్లాంచెట్, గ్రీన్ పార్టీ అధ్యక్షుడు జొనాథన్ పెడ్నాల్ట్ లు వారు పోటీ చేసిన నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు.
కెనడాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 172 మంది సభ్యులు అవసరం. అయితే, లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు.
అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్ 51వ రాష్ట్రంగా చేరాలంటూ ట్రంప్ బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు భారత్ నూ కెనడాకు దౌత్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన కార్నీ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కెనడా కాలమానం ప్రకారం ఏప్రిల్ 28న పోలింగ్ జరగగా ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి.
ది న్యూ డెమొక్రటిక్ పార్టీ, బ్లాక్ క్యుబెకాయిస్, గ్రీన్ పార్టీ.. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. మొత్తం 28 మిలియన్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజాగా చేపట్టిన ఓట్ల లెక్కింపులో లిబరల్ పార్టీ హవా కనింపించింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ భారీ మెజారిటీని అందుకుంటోంది. లిబరల్ నేత, ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ, కన్జర్వేటివ్ నాయకుడు పియరీ పోయిలివ్రే, ఎన్డీపీ చీఫ్ జగ్మీత్ సింగ్, బ్లాక్ క్యూబెకోయిస్ అధినేత వైవ్స్-ఫ్రాంకోయిస్ బ్లాంచెట్, గ్రీన్ పార్టీ అధ్యక్షుడు జొనాథన్ పెడ్నాల్ట్ ఆధిక్యత సాధించారు.
కెనడా ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ దేశం విధించిన టారిఫ్, అమెరికాలో 51వ రాష్ట్రంగా పరిగణిస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకుంది లిబరల్ పార్టీ. మాజీ ప్రధాని జస్టిన్ ట్రుడో హయాంలో చెలరేగిన వ్యతిరేకతను సైతం ఇది రూపుమాపేలా చేసింది.
జస్టిన్ ట్రుడో హయాంలో భారత్- కెనడా మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా ఆయన చేసిన ప్రకటనలు దుమారం రేపాయి. ఆయనపై తీవ్ర వ్యతిరేకత చెలరేగడానికీ దారి తీసిందీ ఉదంతం.