election | స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి..
election | యాదాద్రి ప్రతినిధి, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి, ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరేయాలని డీసీసీబీ మాజీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి(Gongidi Mahender Reddy) అన్నారు.
ఈ రోజు జిల్లాలోని యాదగిరిగుట్టలోని తమ కార్యాలయంలో
కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల సెంటర్ చైర్మన్ పయ్యావుల ఎల్లయ్య(Payyavula Ellaiah), బొచ్చు కనకయ్యలు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. గొంగిడి మహేందర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు గోపగాని యాదగిరి గౌడ్, కొమ్ము పాండు, ఇప్ప సిద్ధులు, కట్ట శంకర్, అబిద్, గొల్లూరి శ్రీకాంత్, భగవాన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

