యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం లో యాదవ సంఘం నూతన గ్రామ కమిటీ ని ఎన్నుకున్నారు.యాదవ సంఘం అధ్యక్షులుగా మాండ్ర సత్తయ్య, ఉపాధ్యక్షులుగా దయ్యాల బీరయ్య , కోశాధికారిగా మాండ్ర మల్లయ్య, గొల్ల కురుమల సంఘం సొసైటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సత్తయ్య యాదవ్ మాట్లాడుతూ యాదవ సంఘం అభివృద్ధి కి కృషి చేస్తామని, యాదవుల హక్కుల కోసం పోరాడుతామన్నారు.

Leave a Reply