Election | డ్రాఫ్ట్ ఓటర్ జాబిత పై సమావేశం

Election | డ్రాఫ్ట్ ఓటర్ జాబిత పై సమావేశం

Election | భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు ఈనెల 1న వార్డ్ వారిగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా(Draft Voter List)ను విడుదల చేయడం జరిగింది. ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో స్థానిక మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ఆగ్రరంలో సమావేశం నిర్వహించడం జరిగినది.

ఈ సమావేశంలో వివిధ పార్టీల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించడం, సలహాలు సూచనలు స్వీకరించడం జరిగింది. ఈ సమావేశంలో ఎలక్షన్(Election) డిప్యూటీ తహసిల్దార్ అశ్విని బాబు డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్,మున్సిపల్ మేనేజర్ నరేందర్, పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply