Election | బీజేపీ సర్పంచ్‌ల‌కు స‌న్మానం..

Election | బీజేపీ సర్పంచ్‌ల‌కు స‌న్మానం..

Election | మక్తల్, ఆంధ్రప్రభ : నర్వ మండలంలో వారం రోజులక్రితం జరిగిన సర్పంచ్ ఎన్నిక(election)ల్లో బీజేపీ తరపున గెలుపొందిన సర్పంచ్ లు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు నర్వలోని తన ఫార్మ్ హౌస్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. సర్పంచులుగా, ఉపసర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలుపొందిన బీజేపీ నాయకులు ఆయా గ్రామాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో అభివృద్ధి(development) పనులు చేపట్టడం, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అజిత సింహారెడ్డి, జిల్లా నాయకులు లలితా వెంకట్ రెడ్డి, కుర్వ సత్యం, లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచులు డాక్టర్ వెంకటేశ్వర్ రావు, సంధ్యా ఆంజనేయులు, శ్రీధర్ శెట్టి, బీజేపీ పదాదికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply