ఎన్నికల సిద్ధతలో బీఆర్‌ఎస్ దూకుడు

ఎన్నికల సిద్ధతలో బీఆర్‌ఎస్ దూకుడు
- బూత్ స్థాయి బలోపేతం దిశగా అడుగులు
- బూత్‌ల వారీగా నాయకులకు బాధ్యతల అప్పగింత
- ఎన్నికల కమిషన్ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి
- మాజీ జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి
జఫర్‌గడ్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ డా. తాటికొండ రాజయ్య ఆదేశాల మేరకు జఫర్‌గడ్ మండల కేంద్రంలో శనివారం బూత్ స్థాయి ప్రతినిధుల నియామక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిశీలకుడు, మాజీ జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పార్టీ ఇంచార్జ్ పసునూరి మహేందర్ రెడ్డి, మండల కార్యదర్శి పెంతల రాజు కుమార్ బూత్‌ల వారీగా ప్రతినిధుల పేర్ల జాబితాను విడుదల చేశారు.
అనంతరం మారపాక రవి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎన్నికల సంఘం చేపట్టే ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పార్టీ తరఫున నియమించిన ప్రతిని ధులు చురుకుగా పనిచేయాలని సూచించారు. అధికారులు చేసే పను ల్లో లోపాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జఫర్‌గడ్ ఉప సర్పంచ్ కొత్వాల్ కుమార్, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఆకారపు యాకయ్య, యువజన అధ్యక్షుడు మారే పల్లి కరుణాకర్, నాయకులు నాయిని నరేష్, మేరుగు రమేష్, మాచర్ల శ్రీను, కలకోట రజనీకాంత్, మహిళా అధ్యక్షురాలు గోలి కవిత రెడ్డి, రాధిక, గ్రామ శాఖ అధ్యక్షుడు సింగాపురం శ్రీధర్, ఇల్లందుల రాజు, వార్డు సభ్యుడు కుక్కల రాజకుమార్, గుడ్డేటి కొమురయ్య, కుమా రస్వామి, మహేష్ నాయక్, సత్యనారాయణ, నల్లతీగాల శ్రీకాంత్, పిట్ట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
