చేపల వేటకు వెళ్లి వృద్ధుడు మృతి..

మహబూబాబాద్, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలోని రాములు తండ గ్రామ శివారు బానోత్ తండా కు చెందిన భానోత్ నరసింహ అనే వృద్ధుడు చేపల వేటకు వెళ్లి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి బానోత్ తండాకు చెందిన నరసింహ(65) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ గిరిధర్ రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.
