ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : నిర్మల్ పట్టణం ఈద్గాం కాలనీలో గణపతి(Ganapathi) ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి ప్రసాదంగా ఏర్పాటు చేసిన లడ్డూను వేలం నిర్వహించారు. ఈ వేలం ద్వారా గణపతి లడ్డూను ఓ ముస్లిం మహిళ దక్కించుకున్నారు.
రూ. లక్షా 88 వేల 888 పాట పాడి అదే కాలనీకి చెందిన అమ్రీన్(Amreen) (ఇంటర్నెట్ నిర్వాహకురాలు) దక్కించుకున్నారు. ఒక ముస్లిం మహిళ వేలం పాటలో పాల్గొని భారీ ధరతో లడ్డూ(Laddu) ప్రసాదం దక్కించుకోవడంతో అరుదైన విషయం.
మతసామరస్యాన్ని చాటి చెబుతూ కుల మతాలకు అతీతంగా నిమజ్జన శోభాయాత్ర(Shobhayatra)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లడ్డూ దక్కించుకున్నమహిళ అమ్రీన్‌ను గణేష్(Ganesh) మండలి నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

