ఫలించిన నేతల ప్రయత్నం
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ఆర్‌డీటీ(RDT)కి ఎఫ్‌సిఆర్‌ఎ(FCRA)ను రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి అనంతపురం(Anantapur) జిల్లాలోని ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇది ఉమ్మడి జిల్లా పేద ప్రజల విజయంగా పలువురు భావిస్తున్నారు. అలాగే ఎఫ్‌సీఆర్ ఏ రెన్యూవల్(Renewal) కోసం అసెంబ్లీ చట్ట సభల్లో తమ గళాన్నివినిపించిన ఉమ్మడి అనంతపురం జిల్లా శాసనసభ్యులు, ఎమ్మెల్సీల(MLCs)కు ప్రత్యేకంగా పేద ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా కూటమి నేతల ప్రయత్నం ఫలించిందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నఆర్డీటీ సేవలను గుర్తించి ఎఫ్ సి ఆర్ ఏను రెన్యువల్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ఉమ్మడి జిల్లా(Joint District) వ్యాప్తంగా హర్షకేతాలు వ్యక్తం అవుతున్నాయి.