అల్వాల్ : అల్వాల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇండియన్ ఆయిల్ సంస్థ వారి (సీఆర్ఎస్ ) కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సర్వీసెస్ నిధులు ద్వారా మహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా రేడియేషన్ లేకుండా రొమ్ము క్యాన్సర్, కార్వికల్ క్యాన్సర్ ను తెలుసుకునే అత్యాధునిక స్క్రీనింగ్ ఇనిషియేటివ్ మిషన్ ను, తెలంగాణ డయాగ్నస్టిక్స్ మినీ హబ్ ను మంగళవారం మల్కాజ్గిరి లోక్ సభ నియోజకవర్గం ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి డిఎంహెచ్ఓ డాక్టర్ ఉమ గౌరీ, డిప్యూటీ డాక్టర్ శోభ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సీజీఎం బద్రీనాథ్, కైలాష్, అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, మహిత డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డి, మంకెన శ్రీనివాస్ రెడ్డి, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ , బీఆర్ఎస్ నాయకులు, వైద్య సిబ్బంది ,ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.