Edapalli | యువతరాన్ని సర్పంచ్ గా ఎన్నుకోండి…

Edapalli | యువతరాన్ని సర్పంచ్ గా ఎన్నుకోండి…

అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తా


Edapalli | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి (Edapalli) మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మూడవరోజు కోలాహలంగా మొదలయ్యాయి. శనివారం ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి (Brahmanpalli) గ్రామానికి చెందిన మండలి రాజేశ్వర్ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్‌ను అధికారుల సమక్షంలో ఎమ్మెస్సీ ఫారం నామినేషన్ కేంద్రంలో దాఖలు చేశారు.

నామినేషన్ సమర్పించిన అనంతరం అభ్యర్థి మాట్లాడుతూ… గ్రామాభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి (problem solving) కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Leave a Reply