ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ కంటోన్మెంట్: హైదరాబాద్ లో ఈడీ అధికారులు పలు చోట్ల సోదాలు ముమ్మరం చేశారు. గురువారం ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వెస్ట్ మారేడ్పల్లి(West Maredpally)లోని వెల్లింగ్టన్ ఎన్రైవ్లో ఉన్న వ్యాపారవేత్త బూరుగు రమేష్(Ramesh the Bully), ఆయన కుమారుడు విక్రాంత్(Vikrant) నివాసాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. విల్లా నెంబర్ 26లో నివాసం ఉంటున్న బూరుగు రమేశ్ నివాసంలో ఉదయం నుంచి ఈడీ అధికారులు(ED officials) సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో రెండు బృందాల ఈడీ అధికారులు పాల్గొన్నారు. విక్రాంత్.. కాస్పో లీగల్ సర్వీసెస్, మహాదేవ జ్యువెలర్స్, రాజశ్రీ ఫుడ్స్ డైరెక్టర్‌గా ఉన్నారు.

Leave a Reply