5‌‌‌‌‌‌000 విగ్రహాలతో నయా చరిత్ర


( ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ) : 5000 మట్టి గణపతి విగ్రహాల తయారీతో విజయవాడ (Vijayawada) విద్యార్థులు వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో వివిధ కళాశాలల విద్యార్థులతో 2 వేల విగ్రహాల తయారు చేయగా.. మరో 10 విద్యా సంస్థలు మరో 3 వేల విగ్రహాల తయారీ చేశాయి. మట్టి గణపతి పూజించాల్సిన అవసరాన్ని వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే రీతిలో ఈ వినూత్న కార్యక్రమం జరిగింది.

ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ ఎకో ఫ్రెండ్రీ గణేశా (Eco Friendly Ganesh Idols) కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య, కలెక్టర్ లక్ష్మీశా, మున్సిపల్ కమిషనర్ జ్ఞాన్ చంద్ పాల్గొన్నారు.

Leave a Reply