EC | పార్టీల్లో, ఆశావహుల్లో నెలకొన్న టెన్షన్..

EC | పార్టీల్లో, ఆశావహుల్లో నెలకొన్న టెన్షన్..
- మూడు రోజుల నామినేషన్ ల గడువుతో పార్టీ నేతలు ఆశావహుల్లో దంగరగోళం
- తక్కువ సమయం లో ఎవరికి టికెట్ ఇవ్వాలో తేలాక అస్తమయం లో పార్టీ అధిష్టానం నేతలు
EC | గుమ్మడిదల, ఆంధ్ర ప్రభ : ఈసీ మాత్రం రాజకీయ పార్టీలకు అంత టైమ్ ఇవ్వలేదు. కేవలం మూడు రోజులు మాత్రమే నామినేషన్లకు అవకాశం ఇవ్వడంతో.. ఆయా పార్టీల్లో, ఆశావహుల్లో టెన్షన్ (Tension) నెలకొంది. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని ఆశావాహులు.. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని పొలిటికల్ పార్టీలు భావిస్తున్న తరుణంలో.. ఈసీ నోటిఫికేషన్ అందరి నోట్లో వెలక్కాయ పడినట్లుగా మారింది.
అభ్యర్థులను ఎలా ఎంపిక చేయాలి.. ఎవరిని ఎంపిక చేయాలి.. టికెట్ (Ticket) ఆశించి భంగపడిన వారిని ఎలా కంట్రోల్ చేయాలా అని ఆయా పార్టీల పెద్దలు సతమతం అవుతున్నారు. అభ్యర్థుల ఎంపికల విషయంలో తొందరపడితే నష్టపోవచ్చనే భయం అన్ని పార్టీల నేతలను వెంటాడుతోంది. అలాగని నిదానంగా ఎంపిక చేయడానికి సమయం కూడా లేదు. దీంతో ముందు నుయ్యి.. ఎనుక గొయ్యి అన్నట్లుగా రాజకీయ పార్టీల పరిస్థితి తయారైంది.
