Earthquake | జపాన్‌లో భూకంపం… తీవ్రత 6.2

Earthquake | జపాన్‌లో భూకంపం… తీవ్రత 6.2
Earthquake | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జపాన్ (Japan) లో మరోసారి భూకంప భయాలు పుట్టించాయి. ఇవాళ తెల్లవారుజామున భూకంపం (Earthquake) సంభవించింది. పశ్చిమ జపాన్ తీరంలో చోటు చేసుకుంది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
షిమనే ప్రిఫెక్చర్ (Shimane prefecture)లో ఉదయం 10:18 గంటలకు ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అక్కడి అధికారులు తెలిపారు. అలాగే, ఈ భూకంపం వల్ల సునామీ (tsunami) ముప్పు కూడా లేదని స్పష్టం చేశారు. భూకంపం ధాటికి పలు భవనాలు ఊగిపోయాయి. ప్రజలు తీవ్ర భయాందోళనకు (People in extreme panic) గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
