యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు నో చెప్పాలి

యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు నో చెప్పాలి
- ఈగల్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమా రాణి
- పోలీస్, ఈగల్ టీం ఆద్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ, ర్యాలీ
- డ్రగ్స్, మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన
జూలూరుపాడు, ఆంధ్రప్రభ ; జీవితాలను చిత్తు చేసే డ్రగ్స్,మత్తు పదార్థాలకు యువత నో చెప్పాలని ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ హేమా రాణి విద్యార్థులకు పిలుపునిచ్చారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్, ఈగల్ ఫోర్స్ ఆద్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,ఆరోగ్యమైన సమాజా నిర్మాణానికి తోడ్పడాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హేమ రాణి కోరారు.
మాదక ద్రవ్యాలు ప్రాణాయకమైనవని,వాటికి దూరంగా ఉండటమే మంచిదన్నారు.డ్రగ్స్ వద్దు జీవితమే ముద్దు అన్నారు. స్నేహితులు లేదా ఇతరులు బలవంతం చేసిన ధైర్యంగా డ్రగ్స్ కు నో చెప్పాలన్నారు. మాదక ద్రవ్యాల వలన గుండె పోటు,క్యాన్సర్,కాలేయం,లంగ్స్ పాడవుతాయని,మెదడు పనితీరు మందగించడంతోపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ విద్యార్థులకు వివరించారు.మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తుల్లో తీవ్రమైన ఆందోళన,డిప్రెషన్,ఆత్మహత్య ధోరణులు పెరుగుతాయని చెప్పారు.
కుటుంబాలు చిన్నబిన్నం కావడం, డబ్బు కోల్పోవడం,చట్టపరమైన ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థిని,విద్యార్థులకు హేమా రాణి సూచించారు.విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. మానవ జీవితం అమూల్యమైనదని,దానిని డ్రగ్స్ తో పాడుచేసుకోవద్దని డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాదావత్ రవి,విద్యా శాఖ అధికారి బానోత్ జూంకిలాల్, పీహెచ్సి వైద్యులు బానోత్ వెంకటేశ్వర్లు,ఎఫ్ఫర్వో గొర్రెముచ్చు ప్రసాదరావు, ఏఎస్సై శ్రీనివాసరావు, జూలూరుపాడు హెచ్ఎం తంబళ లక్ష్మీ నర్సయ్య, ఎంపీపీఎస్ హెచ్ఎం నేతాజీ, ఉపాద్యాయులు గుగులోత్ సీతారాములు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
