E Mails | అసెంబ్లీ, మెట్రోపై హెచ్చరికలు..

E Mails | అసెంబ్లీ, మెట్రోపై హెచ్చరికలు..
E Mails | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో స్టేషన్‌ను బాంబులతో పేల్చేస్తామని స్పీకర్ విజేందర్ గుప్తాకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
ఇవాళ ఉదయం 7.28 గంటలకు అసెంబ్లీ అధికారిక మెయిల్‌కు, 7.49 గంటలకు స్పీకర్‌కు ఈ మెయిల్స్ అందినట్లు సమాచారం. ఖలిస్తానీ వేర్పాటువాదుల పేరిట వచ్చిన ఈ మెయిల్స్‌లో మధ్యాహ్నం 1.11 గంటలకు ఢిల్లీ అసెంబ్లీని, సాయంత్రం 9.11 గంటలకు ఢిల్లీ మెట్రో స్టేషన్‌ను పేల్చివేస్తామని పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టినప్పటికీ, ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో రాజధానిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
