కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో..

కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో..
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఒడితల గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంట్లో చొరబడి వస్తువులు తీసుకెళ్లడంతో పాటు, చిన్న పిల్లలు, వృద్ధులు, పెద్దలను కరుస్తున్నాయని, ప్రజల ఫిర్యాదుతో ఒడితల సర్పంచ్ బండి భగవాన్ గౌడ్, వాటి నివారణ కోసం చింపాంజీ బొమ్మలను తీసుకువచ్చి, ఇద్దరితో గ్రామ సర్పంచ్ బండి భగవాన్ గౌడ్, ఆధ్వర్యంలో గ్రామంలోని వాడ వాడల తిరుగుతూ కోతులను ఊరు నుండి బయటకు తరలిస్తున్నారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
