డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెష‌ల్ ఫోక‌స్ : సీపీ స‌జ్జ‌నార్‌

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VC Sajjanar) హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Police Commissioner)గా బాధ్యతలు చేపట్టారు. చార్జ్ తీసుకున్న వెంటనే తనదైన శైలిలో చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా డ్రంకెన్ డ్రైవ్ మీద స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. థింక్ బిఫోర్ యూ డ్రింక్ అండ్ డ్రైవ్. గుర్తుపెట్టుకోండి.. మద్యం తాగి వాహనం నడిపితే మూల్యం తప్పదు. బాధ్యత గల పౌరులుగా మద్యం తాగి వాహనం నడపకండి.’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు. బాధ్యతగల పౌరులుగా వ్యవహరించాలని కోరారు. ‘మద్యం తాగి వాహనాలు నడిపి, రోడ్డు ప్రమాదాలకు కారణమై మీ జీవితానికి మీరే వెలకట్టలేని జరిమానాను విధించుకోవద్దు. అని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని ‘రోడ్ టెర్రరిస్టులుగా’ పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం
అలాగే హైదరాబాద్‌ను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ (Drugs)పై ఉక్కుపాదం మోపుతామని గతంలోనే సజ్జనార్ ప్రకటించారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుని.. అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ‘డిజిటల్ అరెస్టులుస‌ ( ‘Digital Arrestsస‌) పేరుతో వచ్చే మోసాలకు దూరంగా ఉండాలని సూచించారు.

బెట్టింగుల జోలికిపోవద్దు
ఇక, ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కారణంగా యువత చెడిపోతోందని, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లలో పాల్గొనే వీఐపీలు ఆలోచించుకోవాలని ఆయన గట్టిగా హెచ్చరించారు. ట్రాఫిక్ సమస్య, కల్తీ ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారులపై వేధింపులకు పాల్పడితే సీరియస్‌గా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

Leave a Reply