హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌ర స‌మీపాన మేడ్చ‌ల్‌లో ఒక కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో డ్ర‌గ్స్ త‌యార‌వుతున్న‌ట్లు మ‌హారాష్ట్ర పోలీసులు గుర్తించారు. దీంతో ఇంత‌వ‌ర‌కూ గుట్టుగా డ్ర‌గ్స్ త‌యారీని పోలీసులు ప‌ట్టుకున్నారు. మేడ్చల్ (Medchal) జిల్లాలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్వహించిన ఆపరేష‌న్‌లో 12 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ లభ్యమయ్యాయి.

ఒక కెమికల్ ఫ్యాక్టరీ (chemical factory) లో డ్రగ్స్ తయారీకి వాడే 32 వేల లీటర్ల రా మెటీరియల్ కూడా పోలీసులు ప‌ట్టుకున్నారు. వాటిని సీజ్ చేశారు. మ‌హ‌రాష్ట్ర‌లో బంగ్లాదేశ్ కు చెందిన మహిళ అరెస్ట్ అవ్వడంతో ఈ డ్రగ్స్ గుట్టు బ‌య‌ట‌ప‌డింది. ఈ కేసుకు సంబంధించి మేడ్చల్ లో 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో ఎండీ, ఎక్స్‌టాసీ, మోలీ, ఎక్స్‌టీసీ పేర్లతో డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ (Drugs) తయారు చేసేందుకు కావలసిన కాంపోనెంట్స్ భారీగా లభ్యమయ్యాయన్నారు. డ్రగ్స్ తయారీ చేస్తున్న కంపెనీని పోలీసులు సీజ్ చేశారు.

Leave a Reply