వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: నగరంలోని ఓ వైద్యుడి ఇంట్లో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్న ఘటన హైదరాబాద్ (Hyderabad) లోని చోటుచేసుకుంది. నగరంలోని ముషీరాబాద్‌లో అద్దెకు ఉంటున్న జాన్‌పాల్ అనే వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడి నివాసంలో తనిఖీలు చేపట్టి.. రూ.3 లక్షల విలువ చేసే డ్రగ్స్ (drugs) ను ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. జాన్‌పాల్‌ను అరెస్టు చేసి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

