మరో విప్లవానికి నాంది డ్రోన్స్

మరో విప్లవానికి నాంది డ్రోన్స్
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
(ఆంధ్రప్రభ, రెడ్డిగూడెం) : రైతులు నూతన వ్యవసాయ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని అధిక దిగుబడులు సాధించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలోని రెడ్డికుంట గ్రామంలో వ్యవసాయ డ్రోన్ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ (Vasantha Krishna Prasad), జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) సోమవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం వల్ల రైతుల ( farmers) కు అనేక ప్రయోజనాలు ఉన్నాయని, వ్యవసాయంలో మరో విప్లవానికి నాంది ఈ డ్రోన్స్ అన్నారు. ట్రాక్టర్లు నడవని తడి భూముల్లో కూడా పనిచేయటం డ్రోన్స్ ప్రత్యేకత అని, డ్రోన్స్ తో పంటపై ఖచ్చితమైన స్ప్రేయింగ్ వల్ల తెగులు, చీడపీడలు నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు.
భూముల్లో క్షేత్ర విశ్లేషణ, పొలాల స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించవచ్చుని, సమర్థవంతమైన పంట పర్యవేక్షణతో ఎదుగుతున్న మొక్కల ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించవచ్చున్నారు. విత్తనాలు విత్తడం, రసాయన ఎరువులు (Chemical fertilizers) చల్లింపులో సమయం, ఖర్చు, శ్రమ ఆదా అవుతుందని, రైతుల శ్రమకు సాంకేతికత తోడవ్వాలని, వ్యవసాయ యాంత్రీకరణకు ఆద్యుడు సీఎం చంద్రబాబు అని గుర్తు చేశారు. ఇటువంటి డ్రోన్స్ సాంకేతిక పరిజ్ఞానం సామాన్య రైతులకు కూడా చేరువలో ఉండాలన్నారు. ఖర్చులు తగ్గి చిన్న, మధ్య తరహా రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పడాలన్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతుల సంక్షేమం, ప్రయోజనాల దిశగా కూటమి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
