తాగునీటి స‌మ‌స్య ప‌రిష్క‌రించాలి

తాగునీటి స‌మ‌స్య ప‌రిష్క‌రించాలి

వరంగల్ కార్పొరేషన్, ఆంధ్ర‌ప్ర‌భ : తాగునీటి స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట 19వ డివిజన్(19th Division)కు చెందిన కాలనీవాసులు ఈ రో్జు ధర్నాకు దిగారు. కాశీబుగ్గ ప్రాంతంలో వస్తున్న రంగు మారిన తాగునీటి సమస్యపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాలని వాసులు మున్సిపల్ కార్పొరేష న్ ఇంజనీరింగ్ అధికారులకు రంగు మారిన నీటిని సీసాల ల్లో తీసుకొచ్చి చూపించారు. తాగునీటి నాణ్యతను నిర్ధారించి, శుభ్రమైన నీరు సరఫరా(Water Supply) చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి కమిషనర్ వచ్చేవరకూ అక్కడి నుండి కదలబోమని కాలనీవాసులు స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి కమిషనర్(Commissioner) స్వయంగా హామీ ఇవ్వాలని కోరారు.

స్థానిక ప్రజలు తాగునీటి సమస్యను తరచుగా ప్రస్తావిస్తున్నా, అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఈ నిరసనకు దిగినట్లు వారు తెలిపారు. ఇటీవల మేయర్ గుండు సుధారాణి దేశాయిపేట ఫిల్టర్ బెడ్(Filter Bed)ను తనిఖీ చేసి అధికారం సిబ్బందిని సైతం హెచ్చరించారు. అయినా అధికారులు ఏమాత్రం స్పందించ‌లేద‌ని మండిప‌డ్డారు.

Leave a Reply