స్వచ్ఛమైన నీరు సరఫరా చేస్తా….

స్వచ్ఛమైన నీరు సరఫరా చేస్తా….

ఊట్కూర్, ఆంధ్రప్రభ : వేసవికాలంలోనీటి ఎద్దడి లేకుండా కృషి చేయడంతో పాటు స్వచ్ఛమైన త్రాగనీరు సరఫరా చేస్తా నని చేస్తానని మల్లేపల్లి సర్పంచ్ సత్యారంకథలప్ప అన్నారు. ఆదివారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో వాటర్ ట్యాంక్ కు శుభ్రం చేసి క్లోరినేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని అన్నారు.

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు దశలవారీగా పరిష్కరిస్తానని అన్నారు. గ్రామంలో డ్రైనేజీ సిసి రోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పాలకవర్గం సభ్యులు ప్రజల సహకారంతో మౌలిక వసతులు కల్పిస్తాననిఅన్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు దోమల నివారణ మందు పిచికారి చేస్తున్నామని అన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అర్హులైన పేద వారందరికీ మంజూరు చేసే విధంగా చూస్తామన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. మంత్రి వాకిటి శ్రీహరి తో నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాననిఅన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమన్, ఉపసర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply