రాజకీయాలకు అతీతంగా సేవలే లక్ష్యం…

రాజకీయాలకు అతీతంగా సేవలే లక్ష్యం…
- చిన్నారుల సంక్షేమమే ధ్యేయం..
- ఆదర్శంగా నిలుస్తున్న వార్డు కౌన్సిలర్లు
- 8, 9 వార్డుల్లో కౌన్సిలర్ల చేతుల మీదుగా డ్రెస్ లు పంపిణీ
- పిల్లల పోషకాహారం, గుడ్ల సరఫరాపై ఆరా
- సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్ల హామీ
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8, 9 వార్డుల కౌన్సిలర్లు ప్రజా సేవలో కొత్త దిశను చూపిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ అభి వృద్ధిని తమ ప్రధాన ధ్యేయంగా చేసుకున్నారు. ఇద్దరు కౌన్సిలర్లు సమన్వయంతో కలిసి తమ వార్డులలోని అంగన్‌వాడీ కేంద్రాలను సంద ర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.

పిల్లలకు అందుతున్న పోష కాహారం, సదుపాయాలపై వివరాలు తెలుసుకుంటూ అవసరమైన మార్పులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలు వేరైనా ప్రజా సేవలో ఏకతాటిపైకి రావచ్చని వారు తమ పనితీరుతో నిరూపి స్తున్నారు. రాజకీయ భేదాలు పక్కనపెట్టి అభివృద్ధి కోసం కలిసి పనిచే స్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నారు.
చిన్నారులకు స్కూల్ డ్రెస్సుల పంపిణి :
చాగల్లు గ్రామంలోని 8, 9 వార్డుల్లో ఉన్న 1,5 అంగన్‌వాడీ కేంద్రాల్లో మంగళవారం చిన్నారులకు స్కూల్ డ్రెస్సుల పంపిణీ కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 8వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్, 9వ వార్డు కౌన్సిలర్ సౌదరపల్లి సంపత్ రాజ్ హాజరయ్యా రు. ఈ సంద ర్భంగా చిన్నారులకు స్కూల్ డ్రెస్సులు పంపిణీ చేసి అంగ న్‌వాడీ కేంద్రా ల్లోని సదుపాయాలను పరిశీలించారు.

కేంద్రాల పనితీరు ను టీచర్లను అడిగి తెలుసుకోవడంతో పాటు, చిన్నారులకు సమయా నికి గుడ్లు అందుతున్నాయా లేదా అని కూడా ఆరా తీశారు.. పిల్లలతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. అదేవిధంగా తాగునీటి సౌకర్యం మెరుగుపరచేందుకు రెండు రింగులు ఏర్పాటు చేయాలని కోరగా కౌన్సి లర్లు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు జయ లక్ష్మి, అరుణ, ఆయమ్మ రేణుక తదితరులు పాల్గొన్నారు.
