Dragon | డ్రాగన్ టైటిల్ నే ఫిక్స్ చేసారా..?

Dragon | డ్రాగన్ టైటిల్ నే ఫిక్స్ చేసారా..?
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. వార్ 2 సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. ఈ సినిమా పై మరింత కేర్ తీసుకుంటున్నారు ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో నటిస్తున్నాడనే వార్త బయటకు వచ్చింది. ఇంతకీ.. ఆ సీనియర్ హీరో ఎవరు..?

వార్ 2 మూవీ డిజాస్టర్ అవ్వడంతో.. డ్రాగన్ షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. ఇటీవల ఈ మూవీ తాజా షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ అలాగే ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు టైటిల్ డ్రాగన్ అంటూ ప్రచారం జరుగుతుంది కానీ.. ఈ టైటిల్ కన్ ఫర్మ్ చేయలేదని మరో పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాకి ఏ టైటిల్ పెడతారా అనేది ఆసక్తిగా మారింది. త్వరలో ఓ మంచి రోజు చూసి ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయాలనేది మేకర్స్ ప్లాన్.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో నటించే నటీనటులు ఎవరు అనేది బయటకు రాలేదు? అయితే.. ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ఇందులో నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అనీల్ కపూర్ తెలుగు ఆడియెన్స్ లో కూడా చాలా మందికి తెలుసు. ఇటీవల యానిమల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక లేటెస్ట్ గా తన ఇన్స్టా స్టోరీలో ఎన్టీఆర్, నీల్ పోస్ట్ పెట్టడంతో తను కూడా ఈ భారీ ప్రాజెక్టులో భాగం అయినట్టు తెలుస్తోంది. ఈ వార్త లీకైనప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ భారీ చిత్రాన్ని జూన్ 25న రిలీజ్ చేస్తామన్నారు కానీ.. అనౌన్స్ చేసిన డేట్ కు వస్తుందా..? వాయిదా పడనుందా..? అనేది తెలియాల్సివుంది.

