Medical | డాక్టర్ సుధాకుమారి సేవలు ఉత్తమం

Medical | డాక్టర్ సుధాకుమారి సేవలు ఉత్తమం
కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూల్ మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డా. సుధాకుమారి (Professor Dr. Sudha Kumari) ఈ నెల 30న పదవీ విరమణ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కాలేజీలో గురువారం విభాగం, ఏపీ జీడీఏ ఆధ్వర్యంలో వేర్వేరు వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను సత్కరించి ఘనంగా సన్మానించారు. వీడ్కోలు సభలో మాట్లాడిన అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. కే. చిట్టి నరసమ్మ మాట్లాడుతూ డా. సుధాకుమారి తన పదవీకాలంలో విభాగాన్ని ఎటువంటి ఇబ్బందులు రానివ్వకుండా సమర్థంగా నడిపించారని, మంచి అడ్మినిస్ట్రేటర్‌గా గుర్తింపు పొందారని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ఫలితాల మెరుగుదలలో ఆమె పాత్ర ప్రత్యేకమైందని చెప్పారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న వెల్నెస్ క్లినిక్ చక్కగా పనిచేస్తోందని, పని విషయంలో డా. సుధాకుమారి ఎల్లప్పుడూ ముందుండి సహకరించారని ప్రశంసించారు.
ఏపీ జీడీఏ అధ్యక్షుడు డా. బ్రహ్మాజీ మాస్టర్ (Dr. Brahmaji Master) మాట్లాడుతూ సంఘానికి ఇటీవల లభించిన గుర్తింపు పట్ల సంతోషం వ్యక్తం చేసి, వైద్యుల సమస్యల పరిష్కారంలో నిరంతర కృషి చేస్తామని తెలిపారు. సన్మాన గ్రహీత డా. సుధాకుమారి మాట్లాడుతూ తన 38 సంవత్సరాల ప్రభుత్వ సేవ ఎంతో సంతృప్తికరంగా గడిచిందని, కర్నూలు మెడికల్ కాలేజీలో గడిపిన మూడు సంవత్సరాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. విభాగం తరఫున అనేక సర్వేలు, ప్రాజెక్టులు చేపట్టినట్లు చెప్పి, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిప్యూటీ సర్జన్‌లు, పరామెడికల్ సిబ్బంది అందరి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. సిందియా శుభప్రద, డా. సాయి సుధీర్, డా. విజయ్ ఆనంద్ బాబు, అసోసియేట్ ప్రొఫెసర్ డా. అరుణ, డా. రేణుక, ఏపీ జీడీఏ నాయకులు మాధవి, శ్యామల, ధమ్మం శ్రీనివాసులు, శ్రీరాములు, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. శ్రీలక్ష్మి, డిసిఎస్‌లు రాధ, వెంకటరమణ, స్వర్ణకుమారి, అసిస్టెంట్ అధికారులైన రవి నాయక్, పుష్పలత, ప్రవీణ, ప్రసన్న రాణి, నాగరాజు, వైష్ణవి, శైలజ, కీర్తి, రంగతులసి తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ మెడిసిన్ విభాగం, ఏపీ జీడీఏ సంయుక్తంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

