సమాన హక్కులు కల్పించిన మహనీయుడు…

సమాన హక్కులు కల్పించిన మహనీయుడు…

ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : సామాన్యుడికి సైతం సమాన హక్కులు కల్పించిన మహనీయుడు భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ అని తొర్రూర్ జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్ ధీరజ్ కుమార్ చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి రేపు మంగళవారం ఉండడంతో ఈ వేడుకలను ముందస్తుగా సోమవారం , జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జె.సి.జె ధీరజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి ధీరజ్ కుమార్ మాట్లాడుతూ… “భారత రాజ్యాంగం ద్వారా సామాన్యుడికి సైతం సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, సమాజంలో న్యాయం, సమానత్వం వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు. అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలను, రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులు, కోర్టు అధికారులు సిబ్బంది పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్‌కు అంజలి ఘటించారు.

Leave a Reply