డీపీఆర్ఓ సస్పెన్షన్
కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఒక కార్టూన్ వైరల్(The cartoon went viral) చేయడంలో కీలక పాత్ర వహించిన సిరిసిల్ల జిల్లా డీపీఆర్ఓ శ్రీధర్‌పై వేటు పడింది. సిరిసిల్ల జిల్లా అధికారుల గ్రూపులో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Whip Aadi Srinivas)పై వచ్చిన అభ్యంతకరమైన కార్టూన్ ను పోస్టు చేసినందుకు డీపీఆర్ఓ శ్రీధర్‌ను సస్పసెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మధ్య సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మొదలైన ప్రోటోకాల్( Protocol) వివాదం కాస్త డిపీఆర్వో మెడకు చుట్టుకుంది. వారం రోజులుగా మీడియాలో.. సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్‌కు మధ్య భిన్నమైన కథనాలు ప్రచురితమవుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కలెక్టర్‌కు, విప్ మధ్య అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఇందులో భాగంగా మీడియాలో ప్రభుత్వ విప్‌ను కించపరిచే విధంగా వచ్చిన కార్టూన్ ను జిల్లా అధికారుల అసోసియేషన్ గ్రూపులో డీపీఆర్వో పోస్ట్(DPRO Post) చేసినట్లు అధికారులు గుర్తించారు..
అందులో “డియర్ విప్ ఆది శ్రీనివాస్ గారు.. సీఎం నా పనితనాన్ని గుర్తించాడు.. నేను ఇక్కడే ఉండి అక్రమార్కుల భరతం పడతా.. పైరవీలు నన్ను తొలగించలేవు” అంటూ ఉన్నకార్టూన్‌ను డీపీఆర్‌వో శ్రీధర్(DPRO Sridhar) పోస్ట్ చేశారు. ఈ కార్టూన్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవ్వడంతో ఆది శ్రీనివాస్ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదన్న కారణంతో డీపీఆర్‌వో శ్రీధర్‌పై వేటు పడింది.

