KKR vs LSG |టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్

కోల్ కతా – ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో భాగంగా నేడు అదిరిపోయే రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ – కలకత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ మ‌ధ్యాహ్నం 3.30కి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో ముందుగా కోల్ కతా నైట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. దీంతో లక్నో బ్యాటింగ్ చేయనుంది.

లక్నో దే పై చేయి…
కోల్‌కతా వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ గురించి మాట్లాడుకుంటే, రెండు జట్ల ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు ఓడిపోయాయి. ఇటువంటి పరిస్థితిలో ఉత్కంఠ మ్యాచ్ చూడొచ్చు. కేకేఆర్‌ తరపున సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, డి కాక్ వంటి గొప్ప ఆటగాళ్ళు ఉన్నారు. లక్నోలో కూడా చాలా మంది దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు కోల్‌కతా నైట్ రైడర్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడగా, అందులో కేకేఆర్ 2 మ్యాచ్‌లు, లక్నో 3 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక్కడ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కోల్‌కతా కంటే కొంచెం ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది.

కె కె ఆర్ టీమ్ : క్వింటన్ డి కాక్ (WK), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితా: మనీష్ పాండే, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, రోవ్‌మన్ పావెల్, లువ్నిత్ సిసోడియా

ఎల్ ఎస్ జి జట్టు : మిచ్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్, wk), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠీ
ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితా: రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్

ఇక రెండవ మ్యాచ్ చండీఘడ్ లో చెన్నై సూపర్ కింగ్స్ – పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతుంది. రాత్రి 7.30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *