ముక్రా కే గ్రామంలో ఇంటింటికీ…
(ఇచ్చోడ, ఆంధ్రప్రభ) : కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తెలంగాణ (Telangana) ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని తెలుపుతూ శుక్రవారం మండలంలోని ముక్రా కే గ్రామ తాజా మాజీ సర్పంచ్ మీనాక్షి ఇంటింటికి వాల్ పోస్టర్ల (wall posters)ను అంటించారు. మహాలక్ష్మి పథకం 2500, తులం బంగారం, రూ.4000 పింఛన్, ఆడపిల్లలకు స్కూటీలు, సంపూర్ణ రుణమాఫీ, రూ.15000 రైతు భరోసా పథకాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను అతికించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పేరుతో ప్రజలను మోసం చేసిందని, ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు (six guarantees) పూర్తిగా అమలు చేస్తానని చెప్పి అధికారంలో వచ్చి 22 నెలలు అవుతున్నా ఇంకా పూర్తిగా హామీలు అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గే సుభాష్ గ్రామస్తులు పాల్గొన్నారు.

