ఇంటింటి ప్ర‌చారంలో కొన‌సాగిన జోరు…

ఇంటింటి ప్ర‌చారంలో కొన‌సాగిన జోరు…

హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ : నవీన్ యాదవ్ గెలుపుతోటే జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధికి బాటలు పడతాయని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) అన్నారు. ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించి, ప్రజలతో మమేకమయ్యారు.

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని, ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు. “రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం స్థిరంగా ఉంద‌నీ, ప్రతి కుటుంబానికి భద్రత, ప్రతి ఇంటికి వెలుగు ఇదే కాంగ్రెస్ ధ్యేయం,” అని శాసనసభ్యులు వేముల వీరేశం పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పుడు నవీన్ యాదవ్‌ను(Naveen Yadav) గెలిపిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని, నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

అనంతరం స్వయం సహాయక మహిళా సంఘాలు నిర్వహించిన సమావేశంలో పాల్గొని మహిళల ఆర్థిక సాధికారతపై ప్రసంగించారు. “మహిళల కృషే సమాజ ప్రగతికి పునాద‌నీ, వారిని కోటీశ్వరులు చేయాలనే సంకల్పం సీఎం రేవంత్ రెడ్డిదని ఎమ్మెల్యే వేముల అన్నారు. మహిళా సంఘాలకు తక్కువ వడ్డీ రుణాలు, రాయితీ పథకాలు(subsidy schemes) కొనసాగుతున్నాయి.

మహిళలకు విద్య, ఉపాధి, చిన్న వ్యాపారాల్లో భాగస్వామ్యం కల్పించే కార్యక్రమాలు అమలులో ఉన్నాయ‌న్నారు. బలహీన వర్గాల అభివృద్ధి పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. “ప్రతి గృహిణి అభివృద్ధి చెందితేనే తెలంగాణ ముందుకు సాగుతుంది,” అని శాసనసభ్యులు వేముల వీరేశం విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన వెంట మాజీ మార్కెట్ చైర్మన్ కాటం వెంకటేశం(Katam Venkatesham), జడల చిన్న మల్లయ్య, తాళ్ల వెల్లంల మాజీ సర్పంచ్ జనగామ రవీందర్ గౌడ్, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు కొసనం అశోక్ యాదవ్, మల్లె బోయిన మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply