Door to Door | కాంగ్రెస్ శ్రేణుల ప్రచార జోరు

Door to Door | కాంగ్రెస్ శ్రేణుల ప్రచార జోరు
ఇంటింటికి తిరుగుతూ…. ఆప్యాయంగా పలకరిస్తూ.
Door to Door | ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : ములుగు జిల్లా మల్లం పల్లి గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం జోరుని పెంచారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. తమ అమూల్యమైన ఓటును హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు వేసి గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి లాద శ్యామ్ రావు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆదివారం శాంతినగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానని, ఎవరికి ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ క్రమంలో ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తూ తిలకం దిద్ది శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట మాజీ ఉప సర్పంచ్ చెరుకుపల్లి శ్రీకాంత్ రెడ్డి, ముత్యాల వెంకటేశ్వర్లు, కొంగరి నరేందర్, జింక వేణు, శ్రీను తదితరులున్నారు.
