ఉద్యోగ సర్వీసులో ఈ పొరపాటు చేయొద్దు : శ్రీకాకుళం డీఆర్డీవో
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ఉద్యోగ సర్వీసులో ఎలాంటి పొరపాట్లు చేయరాదని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు(M. Venkateswara Rao) తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అక్టోబరు 27 నుండి నవంబరు 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న విజిలెన్స్ ఎవేర్ నెస్ వీక్ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతి ఉద్యోగి తన ఉద్యోగం పట్ల శ్రద్ధగా పనిచేయాలని, ఎలాంటి లంచాలకు తావు ఇవ్వకూడదని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్(ACB Circle Inspector) ఎస్.వి. రమణ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎసిబి డిజిపి ఆదేశాల పై అక్టోబరు 27వ తేదీ నుండి నవంబరు 2వ తేదీ వరకు ఏసీబీ విజిలెన్స్ ఎవర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగి తన సర్వీసులో ఎలాంటి లంచాలకు అలవాటు పడకుండా ఉండాలన్నారు. దీని వలన సర్వీసులో ఎన్నో ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. విజిలెన్స్ ఎవేర్ నెస్ కార్యక్రమంలో కలెక్టరేట్(Collectorate) పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయ, కె. భాస్కరరావు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

