వంతెన లేకపోవడంతో…
గన్నేరువరం, ఆంధ్రప్రభ : తుఫాన్ ప్రభావం (cyclone impact) తో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండల కేంద్రంలోని ఊర చెరువు మత్తడి వద్ద ప్రవాహ తీవ్రత అధికంగా ఉండడంతో గన్నేరువరం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
పారువెల్ల, జంగపల్లి (Paruvella, Jangapalli) గ్రామాల మధ్య వంతెన లేకపోవడంతో లో లెవెల్ కల్వర్టుల పై నుండి వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తునడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అకాల వర్షంతో ఐకేపీ కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వేల ఎకరాలలో పత్తి వరి పంట వాన తాకిడికి గురైంది. ఎస్సై జి. నరేందర్ రెడ్డి వరద ఉధృతిని పరిశీలించి ప్రజల రాకపోకలను నివారించడానికి బారికేడ్ లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ఉధృతి తగ్గేవరకు వరద నీటి గుండా ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దని మండల ప్రజలకు సూచించారు. ఇప్పటికైనా ముందుగా బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

