హైదరాబాద్ : రాష్ట్ర పోలీసులను రాజకీయాల్లోకి లాగొద్దని.. ఎవరైనా పోలీసులను ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని నడిపితే.. గత బీఆర్ఎస్లా తాము ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం ఘటనపై మాట్లాడుతూ… నగరంలో శాంతి భద్రతలు క్షీణించాయని అనడానికి ఈ ఘటన నిదర్శమన్నారు.. రాజధాని నగరంలో యువతిపై అత్యాచారయత్నం జరిగి రెండు రోజులు అవుతున్నా నిందితుడిని పట్టుకోలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
కాగా, పల్లా వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. హైదరాబాద్ లోక్ ట్రైన్ అయిన ఎమ్ఎమ్టీఎస్లో జరిగిన ఘటనలో నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారని సమాధానమిచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులకు సంబంధించి సంస్కరణలు చేసిందన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్ కొనసాగుతున్నదని, నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. రాష్ట్ర పోలీసులను రాజకీయాల్లోకి లాగొద్దని.. ఎవరైనా పోలీసులను ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని నడపడం వల్ల బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చున్నదని చురకలటించారు.