TG | అందాల పోటీతో స్త్రీ జన్మను అపవిత్రం చేయొద్దు : సీపీఐ నేత‌ నారాయ‌ణ‌

హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో అందాల పోటీలను అందరూ వ్యతిరేకించాలని.. పవిత్రమైన స్త్రీ జన్మను అపవిత్రం చేయొద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో మేనకోడలకు చెందిన కావేరి ఫుడ్ ప్రొడెక్ట్ షాపును నారాయణ ప్రారంభించి మాట్లాడారు. తన మేనకోడలు పావని అందాల పోటీలో పాల్గొంటే ఫస్ట్ వస్తుందని ఛలోక్తులు విసిరారు. కానీ అలా చేయడం తప్పని.. పవిత్రమైన స్త్రీ జన్మను అపవిత్రం చేయొద్దని కోరారు.

కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అందాల పోటీలు నిర్వహించడం అత్యంత బాధాకరమ‌న్నారు. ఈ పోటీలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. తన మేనకోడలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి పది మందికి సేవ చేయాలన్న సంకల్పంతో స్వయం ఉపాధిని ఎంచుకుందని గుర్తుచేశారు. పది మందికి జీవనాధారం కల్పించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అందాల పోటీ అంటే ఏంటి? స్త్రీ జాతిని నడిరోడ్డులో పెట్టి వేలం వేయడం కాదా? ఇది పద్ధతి కాదు.. స్వయం శక్తితో బతికేందుకు స్త్రీలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరారు. అందాల పోటీలు నిర్వహించే రేవంత్‌రెడ్డికి బుద్ధిలేదన్నారు. రూ.25కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చెప్పుకోవడం అత్యంత పవిత్రమైన స్త్రీ జాతిని అవమానించడమేనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *