విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దు

విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దు
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కర్నూల్ రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర రోడ్లు, రహదారులు మౌలిక వసతులు, సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలం కేంద్రంలో పెండేకంటి నగర్లో అంగన్వాడీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వంద శాతం విద్యార్థులు హాజరు ఉండేలా చూడాలని టీచర్లకు సూచించారు. అంగన్వాడీ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అంగన్వాడీలలో 15 రోజుల్లో అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు.
