అచ్చంపేట, ఆంధ్రప్రభ : శ్రీశైలం ఉత్తర ద్వారంగా ఖ్యాతిగాంచిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి దాతలు విరాళాలు అందజేశారని ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.
అచ్చంపేటకు చెందిన కామాక్షి లేడీస్ కార్నర్ వారు తమ తల్లిదండ్రులు ఇల్లెందుల రంగయ్య, అనసూయమ్మల జ్ఞాపకార్థంగా రూ.25,116 విరాళంగా అందజేశారు.
అలాగే సూర్యాపేట జిల్లా వాస్తవ్యులు, జమునాల గోత్రానికి చెందిన కంచుగడ జంగయ్య–ఇందిరమ్మ దంపతులు నిత్య అన్నదాన కార్యక్రమానికి రూ.15,000 విరాళం అందజేశారని పేర్కొన్నారు.
విరాళాలు అందజేసిన దాతలను ఆలయ సిబ్బంది శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

