విగ్రహ నిర్మాణానికి విరాళాల వెల్లువ..

జుక్కల్(కామారెడ్డి), ఆంధ్రప్రభ : చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని జుక్కల్ మండల కేంద్రంలో శివాజీచౌక్ వద్ద భావ్యమైన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పలువురు దాతలు తమఉదారత చాటుకున్నారు. విగ్రహ నిర్మాణానికి తమ వంతు సహాయంగా విరాళాలను ప్రకటించారు. జుక్కల్ మండల మరాఠ సమాజానికి చెందిన పెద్దలు దాదరావు పటేల్ రూ. లక్ష విరాళంగా ప్రకటించడం జరిగింది. దింతో పాటు మొహ్మదాబాద్ గ్రామా సర్పంచ్ భర్త ప్రజ్ఞాకుమార్ (బాలుసార్) రూ. 51వేలు మరియు జుక్కల్ లోని శ్రీసాయి విద్యానికేతన్ ప్రిన్సిపాల్ నీవర్తి పాటిల్(సుల్తాన్ పెట్) రూ. 51వేలు విరాళంగా ప్రకటించడంతో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణ కమిటీ వారిని శాలువలతో సన్మానించడం జరిగింది.
