Donation | కనకదుర్గమ్మకు వెండి పాత్రల విరాళం..

Donation | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి (To Sri Durga Malleswara Swamy Temple) ఓ భక్తుడు వెండి వస్తువులను బహుమతిగా అందజేశారు. ప్రకాశం జిల్లా, చీమకుర్తి గ్రామానికి చెందిన మారమ్ కుటుంబం సభ్యులు ఇంద్రకీలాద్రి దుర్గా దేవస్థానానికి దాదాపు 7.37 కిలోల వెండిని విరాళంగా అందించారు. ఈ వెండి విరాళం విలువ సుమారు రూ. 12,82,000/- ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆరుగురు తమ సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన వెండి వస్తువులను దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వి.కె. సీనా నాయక్ ని మంగళవారం కలిసి అందజేశారు. వీటిలో వెండి ప్లేట్ (1.258 కిలోలు), వెండి గిన్నె (1.096 కిలోలు), వెండి పళ్ళెం (1.198 కిలోలు), వెండి పళ్ళెం (1.279 కిలోలు), వెండి ప్లేట్ (1.253 కిలోలు), వెండి ప్లేట్ (1.286 కిలోలు) లు ఉన్నాయి. దాతల కుటుంబానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈఓ చిన్న నాయక అమ్మవారి చిత్రపటం రసీదు, ప్రసాదం అందజేశారు.

Leave a Reply