Dogs | కుక్కలే..కుక్కలు

Dogs | కుక్కలే..కుక్కలు                   

వడ్డాది  జనం -బిక్కు బిక్కు 

అనకాపల్లి (ఆంధ్రప్రభ)

Dogs | అనకాపల్లి జిల్లా వడ్డాది (vaddadi) లో ప్రజలను కుక్కలు హడలెత్తిస్తున్నాయి. బుధవారం నుంచి ఓ పిచ్చికుక్క(dogs bites )  వడ్డాదిలో సంచరిస్తూ 30 మంది వ్యక్తులను (people), 20 పశువులను  ( injured )  గాయపరిచింది. కొంతమంది చిన్నారులను వృద్ధులను వెంబడించి మరి కాటు వేసింది.వీరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ పిచ్చికుక్కన పట్టుకునేందుకు పంచాయతీ సిబ్బంది, యువకులు రెండు రోజులుగా ప్రయత్నించినా దొరకలేదు. రాత్రివేళ కొంత మంది కర్రలు పట్టుకుని (might beats in streets)  వీధుల్లో గస్తీ కాస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.చిన్నారులను తల్లిదండ్రులు స్కూలుకు పంపడానికే భయపడుతున్నారు.వడ్డాది, విజయరామరాజుపేట,బంగారు మెట్ట పరిసర ప్రాంతాల్లో పిచ్చికుక్క సంచరిస్తున్నట్లు తెలుస్తుంది.

పిచ్చికుక్కకు భయపడి ప్రజలు బిక్కు బిక్కుమంటూ తమ రోజువారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.వడ్డాది గ్రామంలో సుమారు 50 నుండి 100 కుక్కలు (hundred dogs)  ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.వీటిలో కొన్ని కుక్కలు బొచ్చు ఊడిపోయి అనారోగ్యంతో సంచరిస్తున్నాయి.ఇవి మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కుక్కల అరుపులకి రాత్రివేళ నిద్ర ఉండటం లేదని పలువురు వాపోతున్నారు.శనివారం కుక్కల ఏరివేత చేపడతామని పంచాయితీ ఈవో లవరాజు ( EO Lava raju)  తెలిపారు.గ్రామంలో పూర్తిగా కుక్కలు లేకుండా పట్టివేయాలని గ్రామస్తులు, గ్రామ పెద్దలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply