DOGS | ఒక్కరోజే ఇద్దరు చిన్నారులపై దాడి

DOGS | ఒక్కరోజే ఇద్దరు చిన్నారులపై దాడి
DOGS | పెడన, ఆంధ్రప్రభ : పెడన పట్టణంలోని 11వ వార్డులో పిచ్చికుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శునకాల దాడిలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.తమ ప్రాణాలను కాపాడటానికి మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. పిచ్చి కుక్కల దాడులపై ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శునకాల దాడులు ప్రతిరోజూ పెరిగిపోతున్నాయని పట్టణ ప్రజలు ప్రజలు చెబుతున్నారు.
