ముమ్మరంగా డాగ్ స్క్వాడ్ తనిఖీలు
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : డిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటన సందర్భంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ(District SP Narasimha) ఆదేశాల మేరకు హుజూర్‌నగర్ పట్టణంలో జిల్లా పోలీస్ భద్రతా విభాగం పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందం(dog squad team) ఈ రోజు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ తనిఖీలు చేశారు. తనిఖీల్లో పాల్గొన్న డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్(Bomb Squad) సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు బస్టాండ్ ఆవరణలో, కూరగాయల మార్కెట్, షాపింగ్ మాల్స్ వద్ద విసృత తనిఖీలు నిర్వహించారు.
బస్సులు నిలుపు ప్రాంగణాలను, దుకాణాలు, బస్సులు, ప్రయాణికుల లగేజీ(buses, passengers’ luggage), అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ సిఐ చరమందరాజు, ఎస్ఐ మోహన్ బాబు, ఆర్ఎస్ఐ అన్వర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


