Hanumakonda | డబ్బు కోసం…

Hanumakonda | డబ్బు కోసం…
ప్రాణం తీసిన వైద్యులు
ఆరోపిస్తున్న బాధితురాలి బంధువులు
Hanumakonda | ఆంధ్రప్రభ, ప్రతినిధి, హనుమకొండ : హనుమకొండ (Hanumakonda) నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఓ మహిళ మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. అడిగినంత డబ్బులు చెల్లించలేదని వైద్యం నిరాకరించిన కారణంగానే బాధితురాలు మృతి చెందినట్లు ఆమె తరుపు బంధువులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం (Ainavolu Mandal) గర్మెళ్ళపల్లి గ్రామానికి చెందిన కల్పన (35) అనే మహిళ జాండిల్స్ కారణంగా 5 రోజుల క్రితం శ్రీ చక్ర హాస్పిటల్ సంప్రదించింది. పేషంట్ జాయిన్ అయిన తర్వాత మొదటి పేమెంట్ రూ.60 వేలు చెల్లించారు.
రెండవ పేమెంటు 50వేల రూపాయలు చెల్లించినట్లు బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని అప్పగించాలంటే మరో 1 లక్ష 73 వేల రూపాయలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని హాస్పిటల్ (Hospital) యాజమాన్యం మొండికేసింది. దీంతో ఆందోళన మరింత ఉధృత స్థాయికి చేరుకుంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు డబ్బు కోసం వృత్తి ద్రోహానికి పాల్పడుతున్నారు. నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోయిన కుటుంబానికి తగు న్యాయం చేయాలంటూ ఆమె తరపు బంధువులు ఆందోళన కొనసాగిస్తున్నారు. సమస్యను సర్దుబాటు చేసే క్రమంలో పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
