Doctor | గ‌ర్భ‌కోశ వ్యాధుల‌పై రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి….

Doctor | గ‌ర్భ‌కోశ వ్యాధుల‌పై రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి….

Doctor | ఊర్కొండ, ఆంధ్రప్రభ : పశువుల్లో సంభవించే గర్భకోశవాదులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ రాజేష్ అన్నారు. ఈ రోజు రాంరెడ్డిపల్లి గ్రామంలో పశువుల్లో సంభవించే గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని సర్పంచ్ అలివేల ఆంజనేయులుతో కలిసి ప్రారంభించారు. అనంతరం నివారణ మందులు అందజేశారు.

ఈ సందర్భంగా పశు వైద్య అధికారి మాట్లాడుతూ అపరిశుభ్రమైన పరిసరాలలో పశువులు ఈనినప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మాయ సకాలంలో పడకపోవడం వల్ల గర్భాశయ వ్యాధులు సంక్రమిస్తాయని, ఈ వ్యాధి వల్ల చూడి నిలబడదనీ, గర్భాశయ వ్యాధులలో పాడిపశువు మాంసం నుండి చీము కారడం ఇలాంటి వాటిని గుర్తించిన వెంటనే పశు వైద్యులను సంప్రదించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply