Doctor | సార్ య‌మా బిజీ..

Doctor | సార్ య‌మా బిజీ..

  • విధులంటే ఆ డాక్ట‌ర్‌కు చిరాకు
  • ఆస్ప‌త్రిలో క‌నిపించ‌ని వైద్యుడు
  • ఆయ‌న కోసం పేషెంట్ల ఎదురుచూపు.
  • ప్రయివేటు ఆసుపత్రులకు పేద‌ల ప‌రుగు

Doctor | మహానంది, ఆంధ్రప్రభ : వైద్యోనారాయణ‌ అన్నారు పెద్దలు. డాక్టర్ అంటే దేవుడి అంత‌టి వారని, అయితే ఇక్కడి డాక్టర్ దేవుడి కంటే ఎక్కువే. వేడుకుంటే దేవుడైన వరమిస్తాడేమో కానీ ఈ డాక్టర్ మాత్రం ద‌ర్శ‌న‌మివ్వ‌డు. నంద్యాల జిల్లా మహానంది మండలంలో తిమ్మాపురం, గాజులపల్లి గ్రామాలలో రెండు ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయి. తిమ్మాపురం(Thimmapuram) వైద్యశాలలో ఇద్దరు వైద్యులు ఉండగా.. ఒకరు 104లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఉన్న ఒక్క డాక్టరు విధులకు డుమ్మా కొడుతుండటంతో నిత్యం చికిత్స కోసం వచ్చే రోగులు వెనుతిరిగి పోతున్నామని రోగులు, వృద్ధులు వాపుతున్నారు.

వృద్ధులైతే చేసేదేమిలేకా డాక్టర్ వస్తాడేమోనని కడుపు కాల్చుకుని రోజంతా ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఆ డాక్టర్ వచ్చినా కొద్దిసేపటికే క్యాంపు పేరుతో పేషెంట్లను వదిలి వెళ్తున్నట్లు ఆరోపణలు(Allegations) వినపడుతున్నాయి. ఈ వైద్యశాలకు దాదాపు ఎనిమిది గ్రామాల నుంచి నిత్యం రోగులు వస్తుంటారు. అంతేకాక స్థానికంగా బాలికల వసతి గృహం ఉంది. వ్యవసాయదారుల(of agriculturists)తో పాటు నల్లమల అట‌వీ ప్రాంత సమీపానికి పలు గ్రామాలు దగ్గరగా ఉండటంతో పాటు డెంగీ, మలేరియా, త‌దిత‌ర చర్మవ్యాధులతో ఈ ప్రాంత వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

Doctor

వైద్యశాలకు రోగుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ విధులు నిర్వహించే నర్సులు, కాంపౌండర్‌లే రోగులకు బీపీ చెకప్‌(BP checkup) తోపాటు రోగులకు మందులను అందజేసి పంపుతున్నారు. రోగులకు పూర్తిస్థాయి చికిత్స అందటం మాత్రం అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. ఉన్నతస్థాయి అధికారులు వచ్చినప్పుడు మాత్రం క్యాంప్(camp) మానుకుని వారి ఎదురుగా ఉంటార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఈ వైద్యుడి గురించి ఉన్నత స్థాయి అధికారులకు తెలిసినా చర్యలు శూన్యం.

Doctor

కిందిస్థాయి వారు విధులు సరిగ్గా నిర్వహించక పోతే చర్యలు తప్పవని సమావేశాలలో చెప్పడమే తప్పా.. క్షేత్ర స్థాయిలో అలాంటివేవి జ‌ర‌గ‌డం లేద‌నేది వాస్తవం. గ్రామీణ ప్రాంతాలలో పేదలకు మెరుగైన వైద్య సేవలు(Medical services) అందించాలని ప్రభుత్వం ఎన్నో నిధులను ఖ‌ర్చు చేస్తూ ప్రచార సాధనాలలో అవగాహన కల్పిస్తుంటే.. వైద్యుల నిర్లక్ష్యంగా కార‌ణంగా రోగులు ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయివేటు ఆసుపత్రికి వెళ్తున్నారు. ఇప్ప‌టికైనా దీనిపై కలెక్టర్(collector) దృష్టి సారించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply