సత్తన్న సన్నిధికి పాదయాత్ర
లక్షేట్టిపేట,అక్టోబర్ 25(ఆంధ్ర ప్రభ) ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్యం మెరుగుపడాలని శ్రీ గూడెం రమా సహిత సత్యనారాయణ స్వామి వారి సన్నిధికి మల్లికార్జున్ అనే కార్యకర్త పాదయాత్ర చేపట్టారు. మండలంలోని సూరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మల్లికార్జున్ శనివారం సూరారం గ్రామం నుండి దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు. కాలినడక వెళ్లి సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లక్షేటిపేటలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు కాలినడకన వెళుతున్న మల్లికార్జున్ ను ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు వేసి ఆయన వెంట పాదయాత్ర చేశారు. అలాగే మల్లికార్జున్ ను పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, మాజీ సర్పంచ్ బియ్యాల సుధాకర్, మాజీ వైఎస్ ఎంపీపీ పెండెం రాజు, మైనారిటీ సీనియర్ నాయకులు మహ్మద్ షేక్ అలీ, నాయకులు లింగంపెల్లి తిరుపతి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

